గుంటూరు జిల్లాను కరోనా వణికిస్తోంది.. జిల్లాల్లో మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు.. ఎవరూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు, పోలీసులతో పాటూ ప్రజా ప్రతినిధులు కూడా రంగంలోకి దిగుతున్నారు.. స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి వస్తున్నవారిని హెచ్చరించి వెనక్కు పంపుతున్నారు.చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజినీ సేవా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా.. రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు తోపుడు బండ్లపై మజ్జిగ అమ్ముతూ కనిపించారు. వెంటనే కారు ఆపిన ఎమ్మెల్యే.. ఆ ఇద్దరిపై మండిపడ్డారు. లాక్‌డౌన్ సమయంలో ఇలా బయటకు రావడం సరికాదని.. ఇలా రోడ్లపై వ్యాపారాలు చేస్తే ఎలా అంటూ మండిపడ్డారు. అందరూ బాధ్యతతో ఉండాలని.. ఏం చేస్తున్నారో అర్థమవుతుందా క్లాస్ తీసుకున్నారు. 'మీకోసం మీ కుటుంబాలు బలికావాలా' అంటూ మండిపడ్డారు.
ప్రభుత్వం లాక్‌డౌన్ ఉందని రోడ్లపైకి రావొద్దని చెబుతున్నా ఎందుకు వస్తున్నరాని ప్రశ్నించారు. కరోనా బారిన పడకుండా.. ఇప్పటివరకు చిలకలూరిపేట సురక్షితంగా ఉందని.. నియోజకవర్గాన్ని ఇలానే ఉంచాలన్నారు. వారిద్దరికి చెరో రూ.2వేలు ఇచ్చి మళ్లీ వ్యాపారం చేయొద్దని హెచ్చరించారు. మళ్లీ రోడ్డుపై కనిపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
మీ వల్ల మీ ఫ్యామిలి బలికావాలా.. యువకులకు వైసీపీ ఎమ్మెల్యే రజినీ క్లాస్