జిల్లాలో అక్రమ లేఅవుట్లలో ఉన్న ఇళ్ళస్థలాలను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకువస్తుంది. ఈ మేరకు అన్ని పట్టణ ప్రణాళికా విభాగాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిచారు. ఈ ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే మరికొన్ని జోడించి త్వరలో ప్రభుత్వ మార్గదర్శకాలు రానున్నాయని కొందరు అధికారులు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లను నిరోధించేందుకు ఈ ఆలోచనను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. దీనిపై గత నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం కూడా తీసుకున్నారు. అనధికార లే అవుట్లలో గతేడాది ఆగస్టు 31 లోపు కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలని. ప్రబుత్వం ఉత్తర్వు సంఖ్య 10 ఈ నెల 8న జారీ చేసింది. దీనికి 90 రోజుల గడువు కూడా విధించింది. ఇప్పటి వరకు ఉన్న అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకుని... తదుపరి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నారరు.
అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం